బ్లాగు మిత్రుడు..

అంతర్జాలమందించిన
అభ్యుదయ సహోదరుడు..

రంగుల హరివిల్లునై
ఎన్నడు తోడుంటానంటూ..

అనురాగం, ఆప్యాయత
ఆహ్లాదం, ఆనందం
అహం, ఆత్మ పరిశీలన
ఆవేశం, ఆక్రోషం
వేదన, నివేదన

మదిలో కదిలో
అన్ని భావాలకు వేదికగా..

ఊహలూ, అపోహలూ
నిజాలూ, నిష్టూరాలూ
విమర్శలూ, ఆత్మవిమర్శలూ
చర్చలూ, ఇష్టాగోష్టులూ

అన్నింటిని కలగలిపి..

బ్లాగు దర్శకులందరినీ,
దరిచేర్చిన అజ్ణాతుడు..

మనందరి సహచరుడు,
ఈ బ్లాగు మిత్రుడు...

(బ్లాగు సదుపాయం
ఏర్పాటు చేసిన వారికి
ధన్యవాదములతో..)

3 Response to "బ్లాగు మిత్రుడు.."

  1. Sai Praveen says:
    April 7, 2010 at 9:52 AM

    సాయిరాం గారు, చాలా మంచి ఆలోచన. బ్లాగ్లోకం లోకి కొత్తగా అడుగు పెట్టిన నేను మీ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను :)

  2. sairam says:
    April 7, 2010 at 10:02 PM

    Thank u..

  3. కెక్యూబ్ వర్మ says:
    April 11, 2010 at 5:18 AM

    good thought

Post a Comment