నిరీక్షణ..

వేకువ వెన్నెల కావొద్దంటే,

అరుణ కిరణమై..
నను మేల్కొలుపుతానంటావ్,

సాయం సంధ్య కావొద్దంటే,


చిరుగాలితో కలిసి..
నను స్పృశిస్తానంటావ్..

ఎండమావి కావొంద్దంటే,


మేఘాలను చేరి..
చిరుజల్లునై తిరిగొస్తానంటావ్..

నే నిరీక్షంచలేను..
ఆ మధ్య క్షణాల్ని కూడా...

నీ ఊహా లోకంలో...




















 
మేఘాల దొంతరలు

కడలి అలలపయనం

చిరుగాలి  ఆహ్లాదం

శీతల పవనం స్పర్శ

ఇంద్ర ధనుస్సు వన్నెలు

కురిసే పొగ మంచు

జాలువారే వెన్నెల

అరుణోదయం ఆగమనం

సంధ్య వీడ్కోలు

"ప్రకృతిలో ప్రతి అణువు"

నీ ఊహా లోకంలో

నాకు నిత్య నూతనమే ప్రియా..

రహస్యం...

నిన్ను చేరాలనే ఆశతో...

నీ వాక్కే   నా ఊపిరిగా మలచుకొని,

సుదూర తీరాలను చేరుకొనే ప్రయత్నంలో...

దారి తెలియక,

రాళ్లను ముల్లను దాటుకొని వెళ్లాను..

నిగూఢ రహస్యం బయల్పడింది,

నీవు నన్ను ప్రేమించ లేదని....

అన్వేషణ..

ఏ.. సంద్రాల ఆవల..
ఏడు వర్ణాల హరివిల్లువైనా,

నిన్ను  వెదకాలని బయల్దేరి
అలసటతో..
ఏడు స్వరాలుగా విడిపోయా..

విడిపోతేనేం..
ఏడేడు జన్మలు
మనిషి పాడుకునే
పాటనైపోతాను..