చిగురించే ఆశ..

నింగిలోని నీలి మబ్బుల పల్లకిలో,
నీవు పయనిస్తుంటే...

అవని అంచు నుండి
నిన్ను చేరాలని ప్రయత్నించి,

రెక్కలు తెగిన పక్షినై
కడలి అలల్లో కలసిపోయాను..

మరలా ఆశలు చిగుర్చి
శక్తిని కూడగట్టుకొని,

ఉవ్వెత్తున లేచి
ఒకే ఒక్క నీటి బిందువునై

నిన్ను స్పృశించే
ప్రయత్నం చేస్తాను..

3 Response to "చిగురించే ఆశ.."

  1. Padmarpita says:
    August 24, 2010 at 10:14 AM

    Baagundandi..

  2. భాస్కర రామిరెడ్డి says:
    September 11, 2010 at 8:31 PM

    sairam గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా తెలుగు బ్లాగరులందరికి శుభాకాంక్షలు

    హారం

  3. రసజ్ఞ says:
    October 7, 2012 at 6:20 PM

    అద్భుతమయిన భావన!

Post a Comment